ఉయ్యూరు సెంటర్లో మంగళవారం రాత్రి విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఓ పత్రికలో గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావుపై తప్పుడు వార్తలు రాయించిన చలసాని ఆంజనేయుల్ని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, విజయ డైరీ చైర్మన్ పదవి తొలగించాలని డిమాండ్ చేశారు. చలసాని ఆంజనేయులు చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి డౌన్, డౌన్ ఆంజనేయులు అంటూ నినాదాలు చేశారు.