కృత్తివెన్ను మండలం మునిపెడ గ్రామంలో దసరా మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. 10వ రోజు శనివారం సాయంత్రం రామాలయం ప్రాంగణం వద్ద ప్రతిష్టింపచేసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.