పామర్రు నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డికే. బాలాజీని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా కోరారు. గురువారం సాయంత్రం మచిలీపట్నంలో కలెక్టర్ ను కలిసి నియోజకవర్గంలోని సమస్యలను వినతిపత్రం అందించి ఆయనకు తెలియజేశారు. రహదారులు, ఇతర సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. మండల అధ్యక్షులు ప్రవీణ్ చంద్ర, లింగమనేని రామలింగేశ్వర రావు, తదిరులు పాల్గొన్నారు.