రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య తెలిపారు. బుధవారం జగ్గయ్యపేటలోని తాతయ్య నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య మాట్లాడుతూనియోజకవర్గంలోని 4 మండలాలకు రూ. 17 కోట్ల రూపాయలు నిధులు ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైనట్లు తెలిపారు.