గుడివాడ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు ఏపీ స్టేట్ వెయర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. రావి నియామకం పట్ల గుడివాడ నియోజకవర్గం శాసనసభ్యులు వెనిగండ్ల రాము హర్షం వ్యక్తం చేశారు.