కృష్ణా లంక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో.. సెప్టెంబర్ 18 వ తేదీన ఎస్జిఎఫ్ఐ అండర్ 19 ఉమ్మడి కృష్ణా జిల్లా టేబుల్ టెన్నిస్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అండర్ 19 ఎస్జీఎఫ్ఐ కార్యదర్శి రవికంత ఆదివారం తెలిపారు. ఈ పోటీలకు 01-01-2006 తరువాత పుట్టిన వారు అర్హులన్నారు. జిల్లాలో ఆసక్తి గలవారు జనన ధ్రువీకరణ, స్టడీ, ఆధార్ పత్రాలతో హాజరుకావాలన్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్, ఏపెన్ గా చదివే వారు అనర్హులన్నారు.