మోపిదేవి: ప్రోటోకాల్ పాటించలేదని విమర్శలు
మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉద్యోగులు టిడిపికి చెందిన దళిత ప్రజాప్రతినిధులను అవమాన పరుస్తూ ప్రోటోకాల్ ఉల్లంఘన చేస్తున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం నిధులు రూ.2.75 కోట్లతో చేపట్టిన పనులను ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు. శిలాఫలకం, బ్యానర్లలో ఎంపిటిసి సభ్యులు కొమ్ము పవన్ కుమార్ పేరు ఏర్పాటు చేయకపోవడంతో పాటు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం శోచనీయం.