ఏపీలో చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. కాకినాడలో విద్యార్థినులను వేధించిన టీచర్, చిన్నారులపై అఘాయిత్యాలపై మాట్లాడుతూ కలెక్టర్ షాన్ మోహన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. 'కీచక టీచర్ల గురించి తెలిసి కూడా చెప్పకపోతే తప్పు. చేజేతులా పిల్లల జీవితాలను నాశనం చేసినవారవుతారు. నా పేరెంట్స్ టీచర్లు.. వాళ్లు స్కూల్లో డ్యూటీ చేయకపోయినా, వాళ్ల వల్ల పిల్లలు చెడిపోయినా ఆ పాపం నాకు వచ్చేది' అని పేర్కొన్నారు.