కర్నూలులో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయించింది. ఈగల్ పేరుతో యాంటీ నార్కోటిక్స్ విభాగం ఏర్పాటుకు సిద్ధమైంది. పీడీ యాక్ట్ పటిష్ఠం చేస్తూ సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు లోకాయుక్త చట్టసవరణ బిల్లును కూడా ఆమోదించింది. లోకాయుక్త నియామకంలో ప్రతిపక్ష నేత లేనప్పుడు ఏం చేయాలనే దానిపై చర్చలు జరిగాయి.