చల్లపల్లి మండలంలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు పోలీసు, రెవెన్యూ యంత్రాంగం చర్యలకు చేపట్టారు. మంగళవారం నడకుదురు, నిమ్మగడ్డ గ్రామాల్లో ఇసుక రేవుకు వెళ్లకుండా ట్రాఫిక్ గేట్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. చల్లపల్లి మండలం సిఆర్జెడ్ పరిధిలో ఉన్నందున ఇసుక అక్రమ రవాణా చట్టరీత్యా నేరమని ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.