కార్తీక మాసం సందర్భంగా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో దేవస్థానానికి చేరుకొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిరోజు జరిగే స్వామివారి నిత్య కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి వారి ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి వారి మొక్కుబడులు చెల్లించుకున్నారు.