నారాయణపేట (D) మాగనూరు ప్రభుత్వ స్కూల్ లో మధ్యాహ్న భోజనం ఫుడ్ పాయిజన్ అవడంతో 100 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటనపై సీఎం రేవంత్ ఆరా తీశారు. ఫుడ్ పాయిజన్‌పై సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అదేవిధంగా విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. టీచర్లు, సిబ్బంది విద్యార్థులను చికిత్స నిమిత్తం మక్తల్ ఆసుపత్రికి తరలించారు. ఐదుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది.