మోపిదేవిలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం ప్రత్యేకత కావడంతో సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వివిధ వాహనాల్లో తరలివచ్చారు. తొలుత నాగవల్లి వృక్షం వద్ద ముడుపులు కట్టి అనంతరం నాగపుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు.