మహారాష్ట్రలో శివసేన, భాజపా నేతృత్వంలోని మహాయుతి కూటమి మరోసారి అధికారం చేపట్టనుందని మాట్రిజ్ సంస్థ ఎగ్జిట్‌పోల్స్‌లో వెల్లడించింది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా మహాయుతి కూటమికి 150-170 సీట్లు వస్తాయని తెలిపింది. కాంగ్రెస్ కూటమికి 110-130 సీట్లు, ఇతరులకు 8-10 సీట్లు రావచ్చని మాట్రిజ్ అంచనా వేసింది.