కోడూరు గ్రామపంచాయతీ పరిధిలోని నరసింహపురం గ్రామానికి చెందిన (11వ) వార్డు నెంబర్ గంటా వరప్రసాద్ (గాంధీ) రాజీనామా చేశారు. మంగళవారం కోడూరు మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీవో సుధా ప్రవీణ్ కి తన రాజీనామాను అందజేశారు. తనకు వయస్సు 80 సంవత్సరాలు నిండడంతో వృద్ధాప్య కారణంగా వార్డు నెంబర్ గా తన విధులు నిర్వహించలేకపోతున్నందున రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా పత్రంలో వివరించారు.