డ్రైనేజీ అధికారుల వైఫల్యం కారణంగా కోడూరు మండల దిగువ ప్రాంత రైతుల పాలిట శాపంగా మారింది. సముద్రపు ఉప్పు నీరు ఎగువకు రాకుండా పాలకాయ తిప్ప అవుట్ పాల్స్ స్లూయిస్ వద్ద తాత్కాలిక చర్యల్లో భాగంగా వేసిన ఇసుక మూటలు గతంలో ఆక్వా రైతులు తొలగించారు. వారిని వెంటనే డ్రైనేజీ అధికారులు పునరుద్ధరించక పోవడంతో, వందలాది ఎకరాలలో వరి నాట్లు నీట మునిగాయని శుక్రవారం రైతులు ఆరోపించారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.