1977 నవంబర్ 19 తేదీ వచ్చిన ఉప్పెన వల్ల నాగాయలంక మండలం సొర్లగొంది గ్రామంలో చనిపోయిన మృతులకు పోలీసు శాఖ స్మారక స్థూపం వద్ద మంగళవారం నివాళులు అర్పించారు. ఆ విపత్తు వల్ల జరిగిన నష్టానికి పోలీసు శాఖ ఏ విధమైన సహాయ సహకారాలు అందించారో గ్రామస్థులకు అవనిగడ్డ సీఐ యువ కుమార్, నాగాయలంక ఎస్సై రాజేష్ పోలీస్ సిబ్బంది వివరించారు.