మలికిపురం: 'ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలి'

69பார்த்தது
మలికిపురం: 'ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలి'
కెనరా బ్యాంక్ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలని మలికిపురం మండలం లక్కవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రుద్రరాజు గోపాలకృష్ణంరాజు కోరారు. విజయవాడ సర్కిల్ కార్యాలయంలో కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్ గా బాధ్యతలు చేపట్టిన విజయలక్ష్మిని ఆయన గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. లక్కవరంలో కెనరా బ్యాంక్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఖాతాదారులకు సేవలు అందిస్తున్నామని బ్యాంకు ఫౌండర్ కూడా అయిన కృష్ణంరాజు తెలిపారు.

தொடர்புடைய செய்தி