మలికిపురం: వాటర్ ట్యాంక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
మలికిపురం మండలం, కత్తిమండ గ్రామంలో ఓఎన్జీసీ, ఈసీ నిధులతో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంకును రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ. అన్ని గ్రామాలలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. నూతన వాటర్ ట్యాంకుల నిర్మాణం కూడా చేపడుతున్నామని అన్నారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.