రాజోలు: సీఎంపై పోస్ట్.. కేసు నమోదు
సీఎం చంద్రబాబు, డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ పై వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ నేతల నాని అసభ్యకర పోస్టులు పెట్టారంటూ రాజోలు పోలీసులకు కూటమి నేతలు సోమవారం ఫిర్యాదు చేశారు. శివకోడు ఎంపీటీసీ కృష్ణారావు ఆధ్వర్యంలో అదే గ్రామానికి చెందిన టీడీపీ, జనసేన నేతలు రాజోలు ఎస్సై రాజేశ్ కుమార్ కు ఫిర్యాదు ఇచ్చారు.