పూర్వీకుల కాలము నుంచి కల్లుగీతను వృత్తిగా చేసుకొని కుటుంబాలను పోషించుకుంటూ ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కల్లుగీత కార్మికుల సంఘం అధ్యక్షుడు చెల్లుబోయిన కేశవశెట్టి ప్రభుత్వాన్ని కోరారు. మలికిపురంలో రాజోలు తాలుక కల్లుగీత కార్మికుల సమావేశం మంగళవారం జరిగింది. కార్మికుల సమస్యలపై సీఎం చంద్రబాబుని కలిసి వినతిపత్రం అందజేస్తామని తెలిపారు.