మామిడికుదురు నుంచి అప్పనపల్లి వెళ్లే కొర్లగుంట రోడ్డు అధ్వానంగా మారింది. సుమారు 600 మీటర్ల మేర గ్రావెల్ రోడ్డు పలుచోట్ల దిగబడిపోయి ప్రమాదకరంగా ఉంది. 2 రోజుల క్రితం కురిసిన వర్షాలకు ఈ రోడ్డు బురదమయంగా మారడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.