రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్‌లో శనివారం జరిగిన క్రికెట్ టోర్నమెంట్లో "టీమ్ మన బాధ్యత ఫౌండేషన్" విజేతగా నిలిచింది. టోర్నీ మొత్తం జట్టు సభ్యులు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచి విజయాన్ని సాధించారు. విజేతలకు ట్రోఫీలు, మెడల్స్ అందజేశారు. ఫౌండేషన్ అధ్యక్షుడు గారా అజయ్ కుమార్ మాట్లాడుతూ, క్రీడలు ఆరోగ్యాన్నిచ్చి యువతను ఆరోగ్యంగా ఉంచుతాయన్నారు.