గొల్లప్రోలు: కొబ్బరి బొండంపై కనకదుర్గమ్మ కళారూపం

72பார்த்தது
గొల్లప్రోలు: కొబ్బరి బొండంపై కనకదుర్గమ్మ కళారూపం
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు వివిధ రూపాల్లో అమ్మ వారిని ఆవిష్కరిస్తున్నారు. గొల్లప్రోలు మండలం చెందుర్తి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయుడు గోవిందరాజులు కొబ్బరి బొండంపై కనకదుర్గమ్మ ప్రతిరూపాన్ని లిఖించి తన కళ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. కొబ్బరి బొండంపై కనకదుర్గమ్మ ప్రతిరూపం వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. విజయదశమి గొప్పతనాన్ని భక్తులకు వివరించాలన్నదే సంకల్పమని చెప్పారు.

தொடர்புடைய செய்தி