గౌడ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్గా నిడదవోలు మండలం రావిమెట్లకు చెందిన సూర్యారావును నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సూర్యారావు ప్రస్తుతం నిడదవోలు మండల టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ గౌడ కార్పొరేషన్ ద్వారా వారి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.