స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ ను మండపేటలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ తెలిపారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట ఎంపీపీ కార్యాలయం లో సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్ లో కలెక్టర్ మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లు, మంచినీరు, పెన్షన్లు, డంపింగ్ యార్డులపై ఎక్కువ ఫిర్యాదులు అందినట్లు చెప్పారు.