కొత్తపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్(ఏరియా ఆసుపత్రి)కి వికలాంగ పేషెంట్లు సౌకర్యార్థం స్థానిక స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ సౌజన్యంతో 5 వీల్ చైర్లను బ్రాంచ్ మేనేజర్ రెడ్డి శివ స్వామి చేతుల మీదుగా శుక్రవారం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి. దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మోర్త వంశీ, మనోహర్, రవి, ప్రసాద్, నాయుడు, గనిరాజు పాల్గొన్నారు.