గోపాలపురం మండలంలోని పంచాయతీ కార్యదర్శులకు, సచివాలయ సిబ్బందికి పరిషత్ కార్యాలయంలో మంగళవారం శిక్షణా తరగతి నిర్వహించారు. త్వరలో చేపట్టబోయే స్కిల్ సెన్సస్ సర్వే కార్యక్రమంపై శిక్షణ కల్పించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ విద్యాపతి, ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ స్కిల్ సెన్సస్ సర్వేలో మండలంలోని 15 ఏళ్లు నుంచి 59 సంవత్సరాల లోపు వారి వివరాలు యాప్లో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు.