పులివెందుల మండలంలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీపీ వరలక్ష్మి అన్నారు. గురువారం పులివెందుల ఎంపీడీవో కార్యాలయ సభా భవనంలో ఎంపీడీవో రామాంజనేయ రెడ్డి ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, వీధిలైట్లు, తదితర సమస్యలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎంపీపీ కోరారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.