పులివెందుల పట్టణంలోని పడమటి ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో ఉన్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గురువారం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, రాష్ట్రీయ శివాజీ సేన కడప జిల్లా అధ్యక్షుడు కొప్పల శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ రాముడుకు వినతిపత్రం అందించారు. ఆంజనేయస్వామి ఆలయం వద్ద మురుగు నీరు చేరడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.