పులివెందుల సబ్ జైలును గురువారం సీనియర్ సివిల్ జడ్జి బాబా ఫక్రుద్దీన్ పరిశీలించారు. జైలు లోపల ఖైదీల హక్కులు, ఉచిత సహాయం, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం, లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ 15100లపై ఖైదీలకు అవగాహన కల్పించారు. ఏవైనా సమస్యలుంటే జిల్లా న్యాయ సేవా అధికార సంస్థను సంప్రదించాలన్నారు. ఆయనతో పాటు సబ్ జైలు సూపరింటెండెంట్, సిబ్బంది ఉన్నారు.