ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు అందాలని వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ శివ శంకర్ ఆదేశించారు. కలసపాడు మండలం తంబళ్లపల్లి, రామాపురం పంచాయతీల్లో కలెక్టర్ గురువారం పర్యటించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు. గ్రామంలోని సమస్యలపై ఆరా తీశారు. కలెక్టర్ వెంట అన్ని శాఖల అధికారులు ఉన్నారు.