నూజండ్ల: ఇంటింటికీ కుళాయి పథకం ప్రారంభించిన మంత్రి

80பார்த்தது
నూజండ్ల మండలంలో ఇంటింటికీ కుళాయి పథకాన్ని పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. మండలంలోని పువ్వాడ ఏస్సీ కాలనీలో గురువారం మధ్యాహ్నం ఇంటింటికీ కుళాయి కనెక్షన్లను మంత్రి గొట్టిపాటి కుళాయి తిప్పి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మల్లికార్జునరావు, నూజండ్ల మండలం ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி