సైబర్ నేరాల పట్ల అవగాహన అవసరం: సీఐ వాసు

51பார்த்தது
సైబర్ నేరాల పట్ల అవగాహన అవసరం: సీఐ వాసు
ప్రజలు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని సీఐ వాసు సూచించారు. బుధవారం తాడికొండలో ఆయన మాట్లాడుతూ వాట్సాప్ లో అపరిచితుల నుంచి వచ్చే లింక్లు ఓపెన్ చేయరాదని సూచించారు. పండుగల పేరుతో కొందరు సైబర్ నేరగాళ్లు ఆఫర్లు ఉన్నాయని లింకులు పంపిస్తారని వాటిని క్లిక్ చేయగానే మన ఖాతాలలో ఉన్న నగదు మొత్తం చోరీ అవుతుందన్నారు. అలాంటి వాటి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.

தொடர்புடைய செய்தி