ఈ-పంట నమోదులో తప్పులుంటే సరిచేసుకోండి

52பார்த்தது
ఈ-పంట నమోదులో తప్పులుంటే సరిచేసుకోండి
నరసరావుపేట మండలంలోని జొన్నలగడ్డ, కేసానపల్లి గ్రామాల్లోని పంట పొలాలను శనివారం జిల్లా వ్యవసాయ అధికారులు మురళి, మస్తానమ్మ పరిశీలించారు. ఆయా గ్రామాలలో ఈ-పంట నమోదు చేసిన పొలాలను, రికార్డులను సూపర్ చెక్ చేశారు. సిబ్బంది తగు సలహాలు అందజేశారు. ఈ పంట నమోదులో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే ఈ నెల ఏడు లోపల సరి చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ అధికారులు నరేంద్రబాబు, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி