తాడేపల్లి సీతానగరం పుష్కర ఘాట్ వద్ద విషాద ఘటన జరిగింది. కృష్ణా నదిలో మునిగి ఇద్దరు యువకులు చనిపోయారు. విజయవాడ న్యూ రాజరాజేశ్వరరావు పేట అరుణోదయ నగర్ కాలనీకి చెందిన ఐదుగురు యువకులు ఆదివారం సాయంత్రం కృష్ణా నదిలో స్నానానికి వచ్చారు. హేమంత్ కుమార్, దుర్గాప్రసాద్ ప్రమాదవశాత్తు నదిలో మునిగి చనిపోయారు. మత్స్యకారులు ఆ యువకుల మృతదేహాలను వెలికి తీయగా పోలీసులు మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.