రెండు రోజుల పాటు నిర్వహించే అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, రాష్ట్రప్రభుత్వ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ అన్నారు. సచివాలయంలో ఆయన మాట్లాడుతూ మంగళగిరి సీకే కన్వెన్షన్ హాలులో ఈ సదస్సును ఉదయం 10:30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారని అన్నారు.