నాగార్జుసాగర్ ప్రాజెక్ట్ 2 గేట్ల నుంచి నీటి విడుదల

51பார்த்தது
నాగార్జుసాగర్ ప్రాజెక్టు 2 క్రస్ట్ గేట్ల నుంచి డ్యాం అధికారులు ఆదివారం నీటి విడుదలను కొనసాగించారు. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 64830 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లగా వస్తోంది. దీంతో ప్రాజెక్ట్ అధికారులు 2 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం సాగర్ నీటిమట్టం 589. 60 అడుగులు వద్ద ఉంది. ఇది 310. 8498 టీఎంసీలకు సమానం. కుడి, ఎడమ కాలువల నుంచి నీటి విడుదల కొనసాగుతోంది.

தொடர்புடைய செய்தி