గుంటూరు జీఎంసీ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనులను నేరుగా పరిశీలించిన తర్వాతనే బిల్లుల చెల్లింపుకు ప్రాసెస్ చేస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. గుంటూరు నల్లకుంట, రామిరెడ్డి నగర్, రవీంద్ర నగర్, శ్యామల నగర్, పట్టాభిపురం, రత్నగిరి నగర్, జన్మభూమి నగర్ తదితర ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ రోడ్లు, డ్రైన్లను బుధవారం కమిషనర్ పరిశీలించారు.