నేడు చినరావూరులోని ఐటీఐ కళాశాలలో జాబ్ మేళా

73பார்த்தது
నేడు చినరావూరులోని ఐటీఐ కళాశాలలో జాబ్ మేళా
తెనాలి చినరావూరులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో బుధవారం జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ మేళాలో దివీస్ లాబోరేటరీ, ఈక్విక్ డైస్ అండ్ మౌల్డ్స్ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. ఐటీఐ ఫిట్టర్, టర్నర్, మెకానిక్, ఎలక్ట్రిషన్ వెల్డర్ తదితర కోర్సులు చదివిన వారు అర్హులన్నారు.

தொடர்புடைய செய்தி