డ్రోన్ రంగంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి దిశా నిర్దేశం చేసేలా అమరావతి డ్రోన్ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. సచివాలయంలో సోమవారం ఆయన డ్రోన్ కార్పొరేషన్ పై సమీక్ష నిర్వహించారు. అమరావతి డ్రోన్ సమ్మిట్ కు చేసిన ఏర్పాట్ల గురించి ప్రభుత్వ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ సీఎంకు వివరించారు.