గుంటూరు జిల్లాలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసిన రమేశ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. అతని కుటుంబ సభ్యులకు చేయూత పథకం కింద రూ. 1. 75 లక్షలు చెక్కును గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మంగళవారం గుంటూరు పోలీస్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హెడ్ కానిస్టేబుల్ రమేశ్ కుటుంబ సభ్యులకు పోలీస్ అధికారులు అన్నివేళలా అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.