ఉండి ఎమ్మెల్యేపై ఫిర్యాదు

65பார்த்தது
ఉండి ఎమ్మెల్యేపై ఫిర్యాదు
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుపై మంగళవారం జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో మాల మహానాడు నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. కాళ్ళ మండలం ఏలూరుపాడు గ్రామంలో ఇటీవల ఎమ్మెల్యే అంబేద్కర్ ఫ్లెక్సీని చింపివేస్తున్న ఘటనపై నేటికీ పోలీస్ అధికారులు చర్యలు చేపట్టలేదని అన్నారు. కావున ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி