తెలుగు భాషా దినోత్సవం సందర్బంగా గురువారం తణుకు టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆధ్వర్యంలో వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ గేయ రచయిత రసరాజు ఆధ్వర్యంలో నన్నయ్య పట్టారిక పీఠం అధ్యక్షులు సుసర్మ, ప్రముఖ పుస్తక రచయిత కానూరి బదరీనాథ్ తెలుగు భాష గొప్పతనాన్ని వివరించారు. అనంతరం పలువురు ప్రముఖులను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించడం జరిగింది.