ఉద్యోగ హక్కుల కోసం తుదిశ్వాస వరకు పోరాడిన మహనీయుడు సుధాకర్ ప్రసాదని తహశీల్దార్ ఎం.సునీల్ కుమార్ అన్నారు. శుక్రవారం తాడేపల్లిగూడెం తహశీల్దార్ కార్యాలయంలో సుధాకర్ ప్రసాద్ చిత్రపటం వద్ద ఆయన నివాళులర్పించారు. సుధాకర్ లేని లోటు రెవెన్యూ సంఘానికి తీరనిదన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు శివశంకర్ పాల్గొన్నారు.