అక్రమంగా రవాణా చేస్తున్న రెండు లక్షల విలువైన దీపావళి బాణా సంచాను సీజ్ చేసినట్లు కొయ్యలగూడెం ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. మండలంలోని కన్నాపురానికి చెందిన వ్యక్తులు వీటిని రవాణా చేస్తుండగా గుర్తించి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. అలాగే దీపావళి పండుగ నేపథ్యంలో అక్రమ బాణాసంచా నిల్వలపై ప్రజలు పోలీసులకు సమాచారాన్ని అందజేయాల్సిందిగా ఆయన సూచించారు.