మండలంలో రైతులకు పామాయిల్ మొక్కలు అందుబాటులో ఉన్నాయని ముసునూరు ఆర్టికల్చర్ అధికారిని కె. జ్యోతి ప్రియాంక శుక్రవారం తెలిపారు. ప్రభుత్వం హెక్టార్ కు రూ.29వేలు, ఫెర్టిలైజర్స్ ఖర్చులకు హెక్టారుకు రూ.5250 చెల్లించడం జరుగుతుందని తెలిపారు. గత ఏడాది సాగు చేసిన రైతులకు హెక్టారుకు 40 శాతం సబ్సిడీ అందించినట్లుగా వివరించారు. మొక్కలు కావలసిన రైతులు, రైతు సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.