రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మంగళవారం నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం సద్గురు గ్రామంలో పర్యటించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యవసాయ పంటలను మంత్రి, ఏలూరు జిల్లా కలెక్టర్ తో పాటు పరిశీలించారు. వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.