కైకలూరు: నిత్యావసర సరుకుల సరఫరాకు చర్యలు

67பார்த்தது
కైకలూరు: నిత్యావసర సరుకుల సరఫరాకు చర్యలు
మండల స్టాక్ పాయింట్ నుంచి రేషన్ దుకాణాలకు నిత్యావసర సరుకులు సరఫరాకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి తెలిపారు. బుధవారం కైకలూరులోని ఎంఎల్ఎస్ పాయింట్ ను ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. నిల్వల వివరాలను పరిశీలించారు. జెసి వెంట ఏలూరు ఆర్డివో అచ్యుత్ అంబరీష్, పౌర సరఫరాల సంస్ధ జిల్లా మేనేజరు శ్రీ లక్ష్మీ, మండల తాహసిల్దారు, గ్రామ రెవెన్యూ అధికారులు తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி