కష్టకాలంలో ఉన్నవారిని ఆదుకోవడం దాతలు ముందుకు రావడం అభినందనీయమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భీమవరం శాఖ వరద బాధితుల సహాయార్థం రూ. 2, 68, 000 సహాయాన్ని ఎమ్మెల్యేకు అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. మీరు చేస్తున్న సహాయం అందరికీ ఆదర్శమని దాతలను అభినందించారు.